ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదు – యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ ఆఫీసర్ ఆర్. పి. సిసోడియా అదేశాలు
డైనమిక్ , బాపట్ల జిల్లా, అక్టోబర్ 28 మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కోస్తాంధ్ర ప్రత్యేక అధికారి, ఏపీ చేనేత–జౌలి శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్. పి. సిసోడియా ఆదేశించారు. నల్లమడ కాల్వ వద్ద పరిశీలన మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించిన సిసోడియా, భారీ వర్షాల దాటికి ఉధృతంగా ప్రవహిస్తున్న హైదరిపేట నల్లమడ కాల్వ వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.కాల్వ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం “తుపాను తాకిడికి ప్రజలు, పశువులు ప్రాణ నష్టం...