కలెక్టర్ మేడం మా ఊరు బ్రిడ్జిని పట్టించుకోండి..కూలిన పేరూర్‌ బ్రిడ్జి – ప్రజల రాకపోకలకు అంతరాయం

డైనమిక్ న్యూస్ ,నల్గొండ జిల్లా, అక్టోబర్ 28 నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు – సోమసముద్రం చెరువు వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షాలు, వరదనీటి ఉధృతికి ఈ నెల 9న కూలిపోయింది. దీని ఫలితంగా హాలియా నుంచి పేరూరు, చిలకాపురం, కొరివేణిగూడెం, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డిగూడెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు బ్రిడ్జి ధ్వంసం కావడంతో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం హాలియా మండల కేంద్రానికి రావాలంటే చెరువు అలుగు నీటిలోంచి నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల ఓ వ్యక్తి అలుగు...