నల్గొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన
నల్గొండ బ్యూరో, అక్టోబర్ 28, డైనమిక్ మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆమె కట్టంగూరు మండలంలోని ఐటిపాముల, కట్టంగూరు, రెడ్డి కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ — “వర్షపు నీరు ధాన్యం కుప్పల వైపు రాకుండా కాలువలు తీసి నీటిని మళ్లించాలి. ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలి” అని సూచించారు.రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తేమశాతం సరిగ్గా ఉన్న...