డిసిసి పదవి లంబాడీలకు కేటాయించాలనీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
మఠంపల్లి, అక్టోబర్ 28 (డైనమిక్ న్యూస్) సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని లంబాడీలకు కేటాయించాలని హైకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూక్య కృష్ణ నాయక్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలో లంబాడీలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తిలలో లంబాడీలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు లంబాడీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి, ముఖ్యమైన పదవులలో అవకాశాలు ఇవ్వడం జరగలేదని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకోవాలి డిసిసి పదవిని లంబాడీలకు కేటాయించే అంశంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర...