వర్షాల హెచ్చరికతో కలెక్టర్ అలర్ట్‌! రైతులకు సూచనలు 48 గంటలపాటు సూర్యాపేట జిల్లాలో వర్షాల సూచన

సూర్యాపేట బ్యూరో , డైనమిక్, అక్టోబర్ 28 జిల్లాలో వచ్చే 48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యపు రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన మంగళవారం కలెక్టర్ ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, అలాగే ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే అర్వపల్లి, వేల్పుచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.కేంద్రాల్లో ధాన్యం నిల్వ పరిస్థితులు, తూకం, రవాణా ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. "వరి కోతకు తొందరపడవద్దు" – కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మెంథా తుఫాన్ ప్రభావంతో...