విద్యార్థుల తరగతి గదిలోకి ‘జిల్లా కలెక్టర్’ —ఉపాధ్యాయుడిగా మారిన తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థుల ప్రతిభ చూసి ఫిదా అయిన కలెక్టర్ ఉపాధ్యాయుల బోధనకు ప్రశంసలు
సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 28 చదువంటే ప్రేమ. విద్యార్థులంటే అభిమానం. ఇవే లక్షణాలు వున్నటువంటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ని ఇతర అధికారుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.జిల్లాలో అభివృద్ధికి చదువే మూలమని, భవిష్యత్తు తరాల ప్రగతికి విద్యే దారిదీపమని ఆయన విశ్వసిస్తారు. అందుకే ఎక్కడ పర్యటనకు వెళ్లినా పాఠశాలలను తప్పక సందర్శిస్తారు. విద్యార్థులను కలుసుకొని, వారి అభ్యసన సామర్థ్యాలను స్వయంగా అంచనా వేస్తారు. ఆ సందర్భాల్లో ఆయన ఒక కలెక్టర్ మాత్రమే కాదు — ఒక ఉపాధ్యాయుడుగా మారిపోతారు. రామన్నగూడెం పాఠశాలలో స్ఫూర్తిదాయక దృశ్యం మంగళవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అడుగుపెట్టగానే...