బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రేపు “హలో విద్యార్థి చలో కలెక్టరేట్” ముట్టడి విజయవంతం చేయాలి – బొడ్డుపల్లి కృష్ణ
డైనమిక్ న్యూస్ ప్రతినిధి, నల్గొండ జిల్లా – అక్టోబర్ 28 ఈ నెల 29న బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో “హలో విద్యార్థి చలో కలెక్టరేట్” ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ పిలుపునిచ్చారు.మంగళవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యావేతనాలు తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు విద్యావేతనాలు (స్కాలర్‌షిప్‌లు)ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 23 నెలలుగా విద్యార్థులు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఒకవైపు గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తూ, మరొకవైపు ఎస్సీ,...