రైతుల సంక్షేమం కోసం మరో అడుగు – నేరేడుచర్లలో ఐకెపి సెంటర్ ప్రారంభం

నేరేడుచర్ల, అక్టోబర్ 28 (డైనమిక్) నేరేడుచర్ల మున్సిపాలిటీలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్‌ను మంగళవారం సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి ప్రారంభించారు. సహకార సంఘం చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ __ రైతులు ఇకపై మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా స్వచ్ఛందంగా ఐకెపి సెంటర్ ద్వారా ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చని తెలిపారు. రైతులకు సరైన ధర లభించేలా, పారదర్శక లావాదేవీలతో ప్రభుత్వం వ్యవస్థను అమలు చేస్తోందని అన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “గ్రామీణ స్థాయిలో ఐకెపి సెంటర్లు రైతులకు భరోసా కల్పించే వేదికలు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. రైతులు ఆనందం...