సూర్యాపేట జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంతుఫాన్ ప్రభావం దృష్ట్యా రైతులకు అప్రమత్తం – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 27 ఈ వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 40 వేల ఎకరాలలో వరి కోతలు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యాపేట జిల్లాలో ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల...