నల్గొండలో మద్యం దుకాణాల లక్కీ డ్రా ఘనంగా ప్రారంభం పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ — కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 27 4,906 టెండర్లకు లక్కీ డ్రా నల్గొండ జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం 4,906 టెండర్లు దాఖలయ్యాయి. ఈ దుకాణాల కేటాయింపుకు సంబంధించి సోమవారం ఉదయం నల్గొండలో లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభమైంది. లక్ష్మీ గార్డెన్ వేదికగా లక్కీ డ్రా కార్యక్రమం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ — “ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించేలా పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగుతోంది” అన్నారు. ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు...