రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,854 కోట్ల భారీ ఆదాయం మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల ద్వారా రికార్డు స్థాయి వసూళ్లు
హైదరాబాద్ , డైనమిక్, అక్టోబర్ 27 మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసారి భారీ ఆదాయం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం మొత్తం 95,137 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,854 కోట్లు చేరాయి. 2023తో పోలిస్తే ఎక్కువ ఆదాయం గతంలో, అంటే 2023లో, ఒక్కో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా ఉండేది. ఆ సమయంలో 1.32 లక్షల దరఖాస్తులు అందగా, మొత్తం రూ.2,640 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి రుసుం రూ.3 లక్షలకు పెంచినప్పటికీ, దరఖాస్తుల సంఖ్య తగ్గిన పరిస్థితిలోనూ ఆదాయం మరింత పెరగడం...