జూబ్లీహిల్స్ అంతు చిక్కని ఓటరు నాడి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఇంకా సస్పెన్స్
హైదారాబాద్, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 27 జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎవరికీ గెలుపు గ్యారంటీగా కనిపించడం లేదు. ప్రజల నాడిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సర్వే సంస్థలకే ప్రతి రోజు కొత్త సంకేతాలు వస్తున్నాయి. సానుభూతి, పథకాల జోరు, మోడీ మానియా కొన్ని ప్రాంతాల్లో సానుభూతి ఓట్లు ప్రభావం చూపుతుంటే, మరికొన్ని చోట్ల ప్రభుత్వ పథకాల జోరు చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు మోడీ మానియా కూడా కొంతమంది ఓటర్లలో కనిపిస్తోంది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రికోణ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మహిళా సెంటిమెంట్‌పై ఆశలు మహిళా సెంటిమెంట్ తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ నాయకత్వం విశ్వసిస్తోంది. అంతేకాదు, సునీతమ్మ భర్త...