మొంత" తుఫాను ప్రభావం నేపథ్యంలో నల్గొండ కలెక్టర్ హెచ్చరిక

రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవొద్దు డైనమిక్ ,నల్గొండ బ్యూరో , అక్టోబర్ 26 రానున్న రెండు నుంచి మూడు రోజులు "మొంత" తుఫాను ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయమై సూచనలు జారీ చేశారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందులో నల్గొండ జిల్లా కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, వంగిన విద్యుత్...