యోగి మార్క్ ప్రజా పాలన — ప్రజాస్వామ్యానికి ప్రాణం
లక్నో, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 26 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన వినయంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సాధారణ పౌరుడొకరు వినతిపత్రం అందజేస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నప్పటికీ, యోగి నిలబడి ఆయన విన్నపాన్ని శ్రద్ధగా చదవడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది.ఆ దృశ్యం ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వానికి అద్దం పట్టింది. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే నాయకుడే ప్రజల మనసుల్లో నిలుస్తాడు అనే సత్యాన్ని యోగి ఆదిత్యనాథ్ తన ప్రవర్తనతో మరోసారి నిరూపించారు. ప్రజాస్వామ్య బలం – ప్రజల గౌరవంలోనే! ప్రభుత్వ పదవులు కేవలం అధికారం ప్రదర్శనకు కాకుండా సేవాధర్మానికి ప్రతీక కావాలని యోగి చూపించారు.సాధారణ ప్రజలతో సునిశితంగా మాట్లాడడం, వారి విన్నపాలను స్వయంగా పరిశీలించడం,...