కోదాడలో సెప్టిక్ ట్యాంక్ ల మాఫియా ముసుగులో దందా రేట్లు తమ ఇష్టానుసారం నిర్ణయించే యజమానులు – బ్లాక్ మెయిలింగ్ కు గురవుతున్న ప్రజలు

డైనమిక్,కోదాడ, అక్టోబర్ 26 కోదాడ పట్టణంలో సెప్టిక్ ట్యాంక్‌ల పేరుతో కొత్త రకం దందా వెలుగుచూస్తోంది. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సెప్టిక్ ట్యాంక్ యజమానులు లాభాల కోసం సిండికేట్‌గా ఏర్పడి బ్లాక్‌మెయిలింగ్ వ్యాపారానికి తెరలేపారు. వాల్ రైటింగ్‌లతో ప్రచారం “మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా..? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి” అంటూ గోడలపై వాల్ రైటింగ్‌లు రాసి ప్రచారం చేస్తున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఒక వ్యక్తి లీడ్ తీసుకొని అన్ని కాల్స్‌ను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇష్టం వచ్చిన రేట్లు, దురుసైన ప్రవర్తన మొదట వచ్చి ట్యాంక్‌ను చూసి రూ.5,000 రేటు చెబుతారు. గతంలో రూ.1,500 మాత్రమే ఉండేది కదా...