తుఫాను మోంత ఉధృతి పెరుగుతోంది — రెడ్ అలర్ట్ జారీ
డైనమిక్ డెస్క్,అమరావతి, అక్టోబర్ 25 ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు మోంత తుఫాను ముప్పు దగ్గర పడుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను బలంగా మారి అక్టోబర్ 28 రాత్రి వైజాగ్ మరియు కృష్ణా జిల్లాల మధ్య, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన వర్షాలు, తుఫాను గాలులు తదుపరి మూడు రోజులు — అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో కృష్ణా, గోదావరి, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఉధృతమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 80 నుండి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని...