జాబ్ మేళా విధులు సక్రమంగా నిర్వర్తించాలి – కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్
గ్రామపాలన అధికారులు, పంచాయతీ సెక్రటరీలకు సూచనలు సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 24 హుజూర్నగర్ టౌన్ హాల్‌లో రేపు, ఎల్లుండి జరగనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం గ్రామపాలన అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ మేళాకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నోడల్ అధికారులుగా నియమించబడిన అధికారులు తమకు కేటాయించిన రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ స్టాల్స్ వద్ద అభ్యర్థులకు అవసరమైన అప్లికేషన్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థుల వివరాలు నమోదు చేయాలి ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి పేరు, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా నమోదు...