కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – ప్రాణాలు కోల్పోయిన పలువురు ప్రయాణికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం

డైనమిక్ డెస్క్ ,ఎపీ కర్నూలు బ్యూరో, అక్టోబర్ 24 కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో ఆవిరై పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌ బస్సు (నంబర్‌ DD 01 N 9490) ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని కిరణాలు చెలరేగిన వేగం కారణంగా పలువురు ప్రయాణికులు బయటపడలేక బస్సులోనే చిక్కుకుని దగ్ధమయ్యారు.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ డోర్‌ను పగలగొట్టి 12 మంది...