1వ తేదీ నుంచి డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఎపి,డైనమిక్, అక్టోబర్ 23 రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు సమర్థవంతంగా అమలవ్వాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్ సంస్కరణలపై సమీక్ష గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమై, గ్రామీణులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు సమీక్షించారు. డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం మంత్రివర్యులు ప్రకటించినట్లుగా, నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభం అవుతాయి. 13,351 గ్రామ పంచాయతీలు స్వతంత్ర యూనిట్లు మాజీ క్లస్టర్ విధానం రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా పల్లెల్లో సేవా సౌలభ్యం పెరుగుతుందని మంత్రి తెలిపారు. నిధులు సమకూర్చడంలో ప్రత్యేక...