పత్తి రైతుల మొబైల్ నంబర్లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి: వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి
డైనమిక్,నల్గొండ బ్యూరో , అక్టోబర్ 23 రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతుల వివరాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేసి సదుపాయాలను సమర్థంగా అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో పత్తి రైతుల మొబైల్ నంబర్లను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ బి. గోపి సూచించారు. చౌడంపల్లి జిన్నింగ్ మిల్లులో పరిశీలన గురువారం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లిలోని వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి డైరెక్టర్ బి. గోపి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లుల నిర్వాహకులతో సమావేశమై పత్తి ఉత్పత్తి, అమ్మకాల స్థితిగతులను తెలుసుకున్నారు. 2.77...