కీలక మార్పుల దశలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్యనాదెళ్ల

డెస్క్ డైనమిక్, అక్టోబర్ 23 ప్రపంచం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా మారుతున్న నేపథ్యంలో టెక్నాలజీలోతమ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓసత్యనాదెళ్ల (Satya Nadella) పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ రాశారు. అందులోపలు కీలక అంశాలను ప్రస్తావించారు.సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతుందన్నారు. కొత్త తరంఆవిష్కరణల్లో తాము ముందుకు సాగుతున్నామని ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమతుల్యతను సాధించడం కష్టతరమైన పని అని, ఏళ్ల పాటుగా కొన్ని కంపెనీలు మాత్రమే దీన్ని చేయగలిగాయన్నారు. విజయం సాధించాలంటే దశాబ్దాల పాటు ఆలోచిస్తూనేఉండాలన్నారు. భవిష్యత్తుపై దృష్టిసారించాలని, నిరంతరం మనల్ని మనం...