నల్లగొండలో రాత్రి ప్రమాదం జరగ కుండా భారీ గెట్లు సరిచేసిన యువకుల సామాజిక బాధ్యతపై అభినందనలు

నల్లగొండబ్యూరో ,డైనమిక్,అక్టోబర్22 నల్లగొండ–హైదరాబాద్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా రాత్రి సమయలో పడిపోయిన ట్రాఫిక్ బారికేడ్లను సక్రమంగా ఏర్పాటు చేసిన యువకులను డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేకంగా సన్మానం చేశారు.సమాచారం ప్రకారం, నల్లగొండ ఎస్పీ ఆఫీసు వద్ద గాలికి అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బ్యారీర్‌ను గమనించిన యువకులు — కంభంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంతికుమార్, భాషపాక శ్రవణ్ — ఇతర వాహనదారుల రక్షణకు సామాజిక బాధ్యతగా వాటిని సక్రమంగా స్థానంలో ఉంచారు. ఈ సందర్భాన్ని గుర్తించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ యువకులను అభినందించారు. డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ “పట్టణంలోని యువతలు రోడ్డుపై పడ్డ బారికేడ్లను గమనించి వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ముందే...