రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి – సీఎం రేవంత్ రెడ్డివైద్యారోగ్య, జీహెచ్ఎంసీ, పోలీసు, ఆర్‌అండ్‌బీ శాఖలతో సమన్వయ కమిటీ ఏర్పాటు ఆదేశంరానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సదుపాయాల కల్పనపనుల పురోగతిపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ
హైదరాబాద్, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంను రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. బుధవారం తన నివాసంలో ఆయన ఈ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేయాలని సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల సమీకరణకు అనుగుణంగా గదులు, ల్యాబ్‌లు, మౌలిక వసతులు నిర్మించాలన్నారు.అలాగే ఆసుపత్రి పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అభివృద్ధి పనులును సమాంతరంగా చేపట్టాలని సీఎం సూచించారు. నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ,...