హుజూర్నగర్‌లో అక్టోబర్ 25న మెగా జాబ్ మేళా గ్రామీణ యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఉత్తమ్ పిలుపు
డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 22 గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నా ఉద్యోగావకాశాలపై అవగాహన లేకపోవడం వల్ల...