నేరేడు చర్ల గోదాంలో హమాలీల మాముల డబ్బులు మాయం  వెనుక –సిబ్బంది సూత్రధారుల నెట్‌వర్క్‌

నేరేడు చర్ల గోదాంలో హమాలీల మాముల డబ్బులు దొంగతనం వెనుక –సిబ్బంది సూత్రధారుల నెట్‌వర్క్‌ డైనమిక్,నేరేడు చర్ల, అక్టోబర్ 22 నేరేడు చర్ల మండలంలోని గోదాంలో చోటుచేసుకున్న హమాలీ కూలీల మాముల దొంగతనం ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. కూలీల చెమట చిందించి సంపాదించిన డబ్బులు కొందరి లంచగొండితనానికి బలి అయ్యాయి. ఈ వ్యవహారంలో ఆఫీస్‌ సిబ్బంది, హమాలీ మేస్త్రి మద్య అంతర్గత సూత్రధారుల నెట్‌వర్క్‌ ఉన్నట్టు బహిర్గతమవుతోంది. హమాలీల మాములు డబ్బులు మాయం – ₹1.18 లక్షల గల్లంతు నేరేడు చర్ల గోదాములో పనిచేసే హమాలీ కూలీలకు చెల్లించాల్సిన మాములు నుంచి ₹1,18,000 రూపాయలు మాయం అయ్యాయి.ఈ డబ్బులు హమాలీ మేస్త్రి, వేమెంట్...