ఏపీపై వాయుగుండం ముప్పు – భారీ వర్షాలకు ఐఎండీ అలర్ట్
విశాఖపట్నం, డైనమిక్, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరికొన్నింటికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి, బుధవారం ఉదయానికి దక్షిణ కోస్తా ఆంధ్ర – ఉత్తర తమిళనాడు తీరాల సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ...