హుజూర్నగర్‌లో భారీ జాబ్ మేళా ఏర్పాట్లు – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం – తెలంగాణ ప్రభుత్వ దృఢసంకల్పం

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 21 తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో దృఢసంకల్పంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న జరగనున్న జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం మంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసి, ఇప్పటికే 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిందని, ప్రైవేట్‌ రంగంలో కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు.“నిరుద్యోగం సమాజంలో పెద్ద సవాల్‌గా మారింది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు...