నల్గొండలో మత్తు టాబ్లెట్స్ రాకెట్ బస్టు17 మందిపై ఎన్‌డీపీఎస్ కేసు నమోదు – 7 మంది అరెస్ట్
నల్లగొండ బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 21 నల్గొండ పట్టణంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం కేసులో పోలీసులు భారీగా బట్టబయలు చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సంయుక్తంగా చేసిన దాడుల్లో 17 మందిపై కేసులు నమోదు కాగా, వారిలో 7 మందిని అరెస్టు చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు ఎలాంటి డాక్టర్ సూచన లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్స్ అమ్ముతున్న ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడిని అరెస్టు చేసి, షాప్‌ను మూసివేశారని చెప్పారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆ మెడికల్ షాప్‌ను సీజ్ చేశారు.ఈ దాడుల్లో సుమారు 30 వేల రూపాయల విలువ గల 2400 స్పాస్మో ప్రాక్సివాన్...