సూర్యాపేట జిల్లాలో పోలీసు అమరవీరుల ఫ్లాగ్ డే ఘనంగా నిర్వహణ
డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 21 సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై జిల్లా ఎస్పీ నరసింహ్ తో కలిసి అమరుల స్మృతికి పుష్పగుచ్ఛాలతో నివాళులు ఘటించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలను గుర్తుచేసి కృతజ్ఞతజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో రోజురోజుకీ పోలీసు బాధ్యత పెరుగుతున్నదని, ప్రశాంత సమాజం పోలీసు త్యాగ ఫలితం అని పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 1న కొత్త బస్టాండ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్వర్...