పిల్లలను కిడ్నాప్ చేశామని చెబుతూ పోలీసుల పేరుతో వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, డైనమిక్ డెస్క్,అక్టోబర్ 21 మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ విషయం మీద ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు జాగ్రత్త సూచించారు. సజ్జనార్ తెలిపారు — “కొంతమంది సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రుల భయాన్ని వాడుకుంటున్నారు. మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్నట్లు రికార్డింగ్ వినిపిస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో మానసిక ఆందోళనకు గురై భయపడకండి” అని సూచించారు.“అత్యాశ, భయం — ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరాలు” అని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా...