చెన్నూగూడెం గ్రామంలో బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థుల సేవా కార్యక్రమం
డైనమిక్,నల్గొండ బ్యూరో , అక్టోబర్ 21 నల్గొండ బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థులు మరియు స్టాఫ్ చెన్నూగూడెం గ్రామపంచాయతీ పరిధిలో శ్రామదానం చేశారు. NSS ప్రత్యేక శిబిరం భాగంగా విద్యార్థులు మంగళవారం చెన్నూగూడెం గ్రామానికి వచ్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో, పంచాయతీ కార్యాలయం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం గ్రామంలో పచ్చదనం - పరిశుభ్రత, మాదకద్రవ్యాల వ్యసనం, బాల్య వివాహాలు, విద్య ప్రాముఖ్యత, ఆరోగ్యం వంటి అంశాలపై నినాదాలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నూగూడెం మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య యాదవ్ NSS శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులను...