ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాలావుద్దీన్

ముస్లింలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం రూపొందించాలి మంగళగిరి,డైనమిక్,అక్టోబర్19 ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాలావుద్దీన్ అన్నారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఈద్గా ఫంక్షన్ హాల్లో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా విద్య, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ముస్లింలకు ఉన్నత విద్యను అందించడంలో ప్రభుత్వం ముందుండాలని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని నివారించేందుకు వనరులు సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉర్దూ భాషను రాష్ట్ర రెండో...