బీసీలకు ద్రోహం చేసిన బీజేపీ నేతలు రాజీనామా చేయాలి : బీసీ హక్కుల సాధన సమితి
డైనమిక్ ,నేరేడుచర్ల, అక్టోబర్ 19 బీసీ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా బీసీలకు తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.ఆదివారం నాడు నేరేడుచర్లలోని బీసీ హక్కుల సాధన సమితి కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన బీసీ బంద్‌లో బీజేపీ పార్టీ పాల్గొనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. “బీసీల హక్కులను అడ్డుకున్న వారే బీసీల బంద్‌కు మద్దతు ఇస్తే — అది ‘దొంగే దొంగ అని అరిచినట్టే’...