గ్రీన్ కార్డ్ లాటరీలో 2028 వరకు భారతీయులకు అవకాశం లేదు
డైనమిక్,వాషింగ్టన్, అక్టోబర్ 19 అమెరికా డైవర్సిటీ వీసా (DV) లాటరీలో భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి, అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఇది భారతీయుల కోసం మరో ఎదురుదెబ్బగా మారింది.అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీలో గత ఐదేళ్లుగా ఎక్కువగా వలస వచ్చిన దేశాలు అర్హత కోల్పోవడం జరుగుతోంది. సంబంధిత అధికారులు వివరాల ప్రకారం, 2021లో 93,450, 2022లో 1,27,010, 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ఈ సంఖ్య అమెరికాకు వెళ్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్ వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల, “అల్ప వలస”...