స్కూల్ బస్సు డ్రైవర్లు బాధ్యతతో నడపాలి – డీఎస్పీ కె. శివరాం రెడ్డి

నల్గొండ సబ్‌ డివిజన్‌లో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు డైనమిక్,నల్గొండ బ్యూరో,అక్టోబర్18 నల్గొండ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి సబ్‌ డివిజన్‌లోని అన్ని ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు శనివారం సాయంత్రం నల్గొండ హెడ్‌క్వార్టర్స్‌లోని టిటిసి వద్ద జరిగింది. డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో స్కూల్‌ బస్సులు ప్రమాదాలకు గురై చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి డ్రైవర్‌,...