కారంపూడి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సోలార్ పథకంపై అవగాహన ర్యాలీ
డైనమిక్,కారంపూడి, అక్టోబర్ 18 కారంపూడి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్‌స్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సోలార్ శక్తి ప్రాధాన్యంపై ప్రజలకు వివరాలు తెలియజేశారు. విద్యుత్ శాఖ లైన్‌మెన్ వై. గోపాల్ మాట్లాడుతూ, “సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లులో గణనీయమైన తగ్గింపును పొందవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకం ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున లబ్ధి పొందవచ్చు” అని తెలిపారు.సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణ...