42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు నిలిపివేతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం: బీజేపీ

డైనమిక్,నేరేడుచర్ల, అక్టోబర్ 18 రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతుగా నేరేడుచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో బీజేపీ రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు, పార్థనబోయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ — బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వంలోని చట్టపరమైన లోపాలు, రాజకీయ వైఖరే ప్రధాన కారణమని అన్నారు.వారు మాట్లాడుతూ, “బీసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించు కుంటోంది. కోర్టులలో బిల్లును సరిగ్గా రక్షించక పోవడం వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోంది. 42 శాతం రిజర్వేషన్లలో...