సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం లో భాగమా ? బీసీ సమస్యను సామాజిక సమరంగా మార్చి, అన్ని పార్టీలను ఒక వేదికపై చేరవేయడం
తెలంగాణలో బీసీ బంధు: 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం బీసీల ప్రత్యేక హక్కుల కోసం బీసీ బంధు కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించి కేంద్రానికి స్పష్టమైన సంకేతం డైనమిక్,హైదరాబాద్,అక్టోబర్18 తెలంగాణలో బీసీ వర్గాల ప్రత్యేక హక్కుల కోసం ‘బీసీ బంధు’ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టబడింది. రాజకీయ వాతావరణం గమనించదగ్గది. ఆధికార కాంగ్రెస్ మాత్రమే కాదు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బిజెపి, సీపీఐ, వామపక్షాలు కూడా బీసీ బంధుకు మద్దతు ప్రకటించాయి. ఇది బీసీ వర్గాల సమస్యను సామాజిక మరియు రాజకీయ మద్దతుతో ముందుకు తీసుకెళ్తున్నదని సూచిస్తుంది. సీఎం వ్యూహం వ్యక్తిగతం కాదని ప్రజాస్వామ్య ఉద్దేశం...