అక్టోబర్ 27 నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభం ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఎపి పాలిటిక్స్,బ్యూరో అక్టోబర్ 27 నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైస్ మిల్లర్లకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుని పోతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.1674 కోట్లు బకాయిలు చెల్లించామని.. రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన763 కోట్లు...