విలువల ఆధారంగా నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి ఐసీఎస్‌ఎస్‌ఆర్–ఎస్‌ఆర్‌సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ. సుధాకర్ రెడ్డీ
విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన నేషనల్ సెమినార్ డైనమిక్, గుంటూరు, అక్టోబర్ 17 విద్య అనేది కేవలం జ్ఞాన సంపాదనకే పరిమితం కాకుండా, విలువల ఆధారంగా నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని ఐసీఎస్‌ఎస్‌ఆర్–ఎస్‌ఆర్‌సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ. సుధాకర్ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో, ఐసీఎస్‌ఎస్‌ఆర్–ఎస్‌ఆర్‌సీ ఆర్థిక సౌజన్యంతో స్కూల్ ఆఫ్ లా అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎంబెడింగ్ ది సినర్జిటిక్ విజన్ ఆఫ్ ఎస్‌డీజీఎస్ అండ్ ఇండియన్ నాలెడ్జ్...