బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అంతర్జాతీయ బాలిక దినోత్సవంలో కలెక్టర్ పిలుపు
డైనమిక్,సూర్యాపేట బ్యూరో "ఆకాశమే హద్దుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి" అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఆచరణలోకి తీసుకురావాలని విద్యార్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత విభాగం నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం–2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘బాలిక చైతన్యం’తో సమాజ మార్పు దిశగా కలెక్టర్ మాట్లాడుతూ, సూర్యాపేటకు కొత్తగా వచ్చినప్పుడు అబార్షన్ కారణంగా ఒక మహిళ మృతి చెందడం బాధ కలిగించిందని, అలాంటి ఘటనలు జరగకూడదనే సంకల్పంతో ‘బాలిక చైతన్యం’...