మెగా ఉద్యోగ మేళా ప్రాంగణం పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ
డైనమిక్, హుజూర్ నగర్, అక్టోబర్ 17 ఈ నెల 25వ తేదీన హుజూర్నగర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న మెగా ఉద్యోగ మేళా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. 20 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 20 వేల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు. భారీ జనసందోహం నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం కల్పించామని వెల్లడించారు. 150 కంపెనీలు పాల్గొనే...