ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ
సూర్యాపేట పట్టణం 38వ వార్డు లో ఘనంగా కార్యక్రమం డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 17 రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సూర్యాపేట పట్టణంలో కొత్తగా మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి,” అని సూచించారు.భూమిపూజ కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో లబ్ధిదారు తాటి కృష్ణవేణి (భర్త శ్రవణ్) ఇంటి వద్ద జరిగింది.ఈ...