మూడు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆనందం – సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి కి తల్లిదండ్రుల కృతజ్ఞతలు

డైనమిక్,జడ్చెర్ల, అక్టోబర్ 17 గత మూడు దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు అడ్డుగా నిలిచిన “మూడు పిల్లల నిబంధన”ను ఎత్తివేయాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది. శుక్రవారం జడ్చెర్ల నియోజకవర్గంలోని క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఈ నిర్ణయానికి సంకేతంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనురుధ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ — “గత 30 ఏళ్లుగా మాకు రాజకీయంగా పాల్గొనే అవకాశాన్ని ఈ నిబంధనే దూరం చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న...