సూర్యాపేట కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – గైర్హాజరు సిబ్బందిపై సస్పెన్షన్
మునగాల తహసిల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డైనమిక్,సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 16 విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన లోపాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మునగాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో డిప్యూటీ తహసిల్దార్ డి. సత్యనారాయణ, ఎంపీఎస్ ఓ సంపత్, జూనియర్ అసిస్టెంట్ సునీల్ గవాస్కర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ లు విధులకు హాజరు కాలేదని గమనించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ సమయం ఉదయం 10.30 దాటినా సిబ్బంది హాజరు కానందున, గైర్హాజరైన వారిని వెంటనే సస్పెండ్...