Wednesday, January 14, 2026
Homeజాతీయంబీహార్‌లో జేడీయూకు షాక్‌ – 11 మందికి సస్పెన్షన్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సీఎం నితీష్‌...

బీహార్‌లో జేడీయూకు షాక్‌ – 11 మందికి సస్పెన్షన్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సీఎం నితీష్‌ కుమార్‌ కఠిన నిర్ణయం

డైనమిక్ డెస్క్,పట్నా, అక్టోబర్‌ 26

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందుగానే జేడీయూలో కలకలం రేగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా మొత్తం 11 మంది నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.పార్టీ ఐక్యతను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు జేడీయూ కేంద్ర నాయకత్వం వెల్లడించింది. సస్పెండ్‌ అయిన కొందరు టిక్కెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.పార్టీ లోపల పెరుగుతున్న అసంతృప్తిని నియంత్రించడానికి నితీష్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల ముందు జేడీయూకు ఇది పెద్ద పరీక్షగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments