Monday, March 2, 2026
Homeతాజా సమాచారంస్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలకై ఎస్ఎఫ్ఐ భిక్షాటన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల...

స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలకై ఎస్ఎఫ్ఐ భిక్షాటన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసేంతవరకు పోరాడుతాం.

డైనమిక్,దేవరకొండ,నవంబర్ 1

ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మెంట్ విడుదల చేయాలని శనివారం  పట్టణంలో భిక్షాటన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో
8 150 కోట్ల స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్మెంటు విడుదల చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీ, బీసీ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి ప్రజాపాలనంటూనే పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు నెంబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.విద్యార్థులుఉన్నత చదువులకు పోవాలంటే స్కాలర్షిష్ ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు టీసీలు, సర్టిఫికెట్ ,మెమోలు ఇవ్వడానికే ఫీజు కడితేనే సర్టిఫికెట్లను ఇస్తామంటూ విద్యార్థులను నిబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో పంటలు చేతికి రాక ఒకపక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద మధ్యతరగతి విద్యార్థుల పక్షాన ఆలోచించి బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువులు ముందుకు పోవడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు నవంబర్ 3 నుంచి కళాశాలలో నిరవధికంగా బంద్ చేస్తామంటూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని దీనివల్ల పేద మధ్యతరగతి చదువుల పైన భారంపడే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యావస్థను నిర్వీర్యం చేస్తూ కనీసం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల పై జాప్యం చేయడం దుర్మార్గం అన్నారు. భవిష్యత్తులో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుంటే విద్యార్థులందరినీ కూడగట్టి బలమైన సమరశీల పోరాటాలకు విద్యార్థిలో సిద్ధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గుండాల మల్లేష్,రసమళ్ళ సింహాద్రి,నేతళ్ళ జయరాం,బోనుగుంట్ల రాజేష్,రవి, మునేష్ పి. రాము,పి.నితిన్,షేక్ సోహిల్,ఏటేలా అనిల్,సిహెచ్,చరణ్, కుంటి గుర్ల మహేష్,పగడాల లక్ష్మణ్, అర్జున్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments