Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంవిద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతంపెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ నిరసన

విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతంపెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ నిరసన

డైనమిక్ న్యూస్,దేవరకొండ, అక్టోబర్ 30

దేవరకొండ పట్టణంలో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై 500 మందికి పైగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ –

“పేద విద్యార్థుల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి,” అన్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుందామంటే కళాశాల యాజమాన్యాలు ‘ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని’ ఇచ్చే పరిస్థితి లేదని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బంద్‌కి పిలుపునిస్తే ప్రభుత్వం చర్చలు జరిపి, 1200 కోట్లు రెండు దఫాలుగా విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటున్నందున రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న విద్యాసంస్థల బంద్‌కు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని, విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నక్క గణేష్, ముత్యాల రామలింగం, గుండాల మల్లేష్, రసమళ్ళ సింహాద్రి, వరుణ్ తేజ్, శుశీల్, మహేష్, మనోహర్, మహిళా నాయకులు మంజుల, అశ్విని, స్వాతి, రేణుక, యమున, సరస్వతి, గీత, అంజలి, కళ్యాణి తదితరులు పాల్గ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments