పాలకవీడు నవంబర్ 24 డైనమిక్ న్యూస్
గ్రామపంచాయతీ రిజర్వేషన్ మండలం ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించాలని బీసీ వారికి 23% రిజర్వేషన్లు కేటాయించాలని అందులో భాగంగా పాలకీడు మండలానికి ఐదు బీసీ రిజర్వేషన్లు రావాల్సి ఉండగా కానీ ఒక్క బీసీ రిజర్వేషన్ రాకపోవడంలో అంతర్యం ఏందని సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల ప్రక్రియ తప్పుల తడకగా ఉందని,అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను వాస్తవంగా సర్పంచ్లను మండల యూనిట్ గా తీసుకోవాలి అదే విధంగా వార్డులను గ్రామ యూనిట్ గా తీసుకుని ఎంపిక చేయాలని ఈ ఎంపికను బట్టి చూస్తే అలా జరగలేదని ఆయన అన్నారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అవకతవకలతో కూడుకొని ఉన్నదని ఇప్పటికైనా పై అధికారులు జరిగిన పొరపాటును గ్రహించివెంటనే సరి చేయాలని, ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
