Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో సంచలన తీర్పు మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్...

బంగ్లాదేశ్‌లో సంచలన తీర్పు మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు

ఢాకా, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్17

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT-1) సోమవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఆందోళన కారులపై ప్రాణాంతక చర్యలకు ఆమె బాధ్యత వహించాల్సిందేనని కోర్టు పేర్కొంది.

“ఆమె చేతులు రక్తంతో తడిచాయి” — ట్రైబ్యునల్ కఠిన వ్యాఖ్యలు

ఆందోళనల సమయంలో భద్రతాదళాలకు “గట్టిగా చంపేయండి” అన్నట్లుగా ఆదేశాలు జారీ చేశారని తీర్పులో పేర్కొంది.ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయిన యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసిన హింసాత్మక చర్యల్లో ఆమె పాలుపంచుకున్నట్టు ట్రైబ్యునల్ అభిప్రాయపడింది.“మానవత్వాన్ని మరిచిన నాయకురాలు” అని వ్యాఖ్యానిస్తూ కోర్టు తీర్పు తీవ్రమైంది.

ప్రస్యూకుషన్ వాదనలు

1,400 మంది ప్రాణాలు పోయాయి,ప్రాసిక్యూషన్ ముఖ్య న్యాయవాది తజుల్ ఇస్లాం వాదన ప్రకారం, 2024 జూలై ఉద్యమాల్లో,1,400 మంది విద్యార్థులు, ప్రజలు మరణించినట్లు,హింస చెలరేగడానికి ప్రధాన కారణం హసీనా ఆదేశాలేనని కోర్టులో నొక్కి చెప్పారు. అంతర్జాతీయ పరిశీలకులు కూడా ఈ కేసును తీవ్రంగా గమనిస్తున్న సంగతి తెలిసిందే,హసీనా పదవీకాలం: 15 సంవత్సరాలకు పైగా దేశాన్ని నడిపిన నేత,షేక్ హసీనా రెండు విడతలుగా బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు.

ఆమె పదవీకాల వివరాలు

మొదటి పదవి: 23 జూన్ 1996 – 15 జూలై 2001,దీర్ఘదైన రెండో పదవి: 6 జనవరి 2009 – 5 ఆగస్టు 2024,అంటే మొత్తం 20 సంవత్సరాలకు సమీపంగా దేశాన్ని నడిపిన నాయకురాలు ఆమె.

తీర్పు సమయంలో హసీనా భారతదేశంలోనే

2024లో భారీ నిరసనల నేపథ్యంలో హసీనా పదవి తప్పుకోవడంతో పాటు, ఆమె భారతదేశంలో గడుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా గతంలో పేర్కొంది. దీనిపై ఆమె పలుమార్లు “రాజకీయ వేధింపులు” జరుగుతున్నాయంటూ ఆరోపించారు.

ఢాకాలో భద్రత కట్టుదిట్టం

కోర్టు పరిసరాల్లో భారీ పోలీస్ బలగాల మోహరింపు,సైన్యం, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ సంయుక్త పహారా,ఇంటర్నెట్ పరిమితులు విధించే అవకాశాలపై పుకార్లు,అన్నీ బంగ్లాదేశ్ అంతటా ఉద్రిక్తతను పెంచాయి.

రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు

ఈ తీర్పుతో బంగ్లాదేశ్‌లో కొత్త రాజకీయ కోణం తెరవబడనుంది.హసీనా అనుచరులు, ఆమె పార్టీ భారీ ఆందోళనలకు దిగే అవకాశం.దేశ రాజకీయ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,ఈ తీర్పు దక్షిణాసియా రాజకీయ పరిణామాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments